వాలంటీర్లే వైసీపీకి రివర్స్..ఇదెక్కడి ట్విస్ట్..?

జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ ఏదైనా ఉందంటే అది గ్రామ సచివాలయ వ్యవస్థ..దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ. దీని ద్వారా నేరుగా ప్రజలకు లబ్ది చేకూరుతుంది. అలాగే ఏ పని కావాలన్న సచివాలయం ద్వారా అయిపోతుంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఆ 50 ఇళ్ల బాధ్యతని వాలంటీరే చూసుకుంటారు.

ఇక ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనే సంగతి తెలిసిందే..ఆ విషయం వైసీపీ నేతలే చాలా సందర్భాల్లో చెప్పారు. అయినా చెప్పడానికి ఏముంది..అదే నిజమని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే సచివాలయ ఉద్యోగులు మాత్రం..నేరుగా కాకుండా అర్హత పరీక్షలో పాస్ అయ్యి..ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఏదేమైనా గాని వాలంటీర్, సచివాలయ వ్యవస్థని జగన్ తీసుకొచ్చారు కాబట్టి..వారంతా జగన్ వైపే ఉంటారని..అంతా అనుకుంటున్నారు. వైసీపీ నాయకులు కూడా అదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.

అయితే ఆ విషయం క్లియర్‌గానే అర్ధమవుతుంది…వాలంటీర్లు పూర్తిగా  వైసీపీ కోసమే పనిచేస్తున్నారు..అలాగే ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతుగా ప్రచారం చేయొచ్చు..వైసీపీకి మద్ధతు పలికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలా వన్ సైడ్ గా వాలంటీర్లు వైసీపీ వైపే ఉన్నారు..సచివాలయ ఉద్యోగులు కూడా దాదాపు వైసీపీ వైపే ఉంటారని భావిస్తున్నారు. అలాగే వారి కుటుంబాలు కూడా. దీంతో వైసీపీకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది.

అడ్వాంటేజ్ ఉండి కూడా వైసీపీ ఎందుకో కాస్త టెన్షన్ పడుతున్నట్లు ఉంది..అంటే వారిలో కొందరు వైసీపీకి మద్ధతుగా నిలబడరని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థని తొలగిస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలని తీసేస్తామని ఎవరో టీడీపీ నాయకుడు మాట్లాడినట్లు ఓ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ సీనియర్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని టీడీపీ తేల్చి చెప్పేసింది. ఆఖరికి దీనిపై కాల్వ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలా వైసీపీ ప్రచారం చేయడం వెనుక..వాలంటీర్, సచివాలయ ఉద్యోగులు తమకు అండగా ఉండరని వైసీపీ డౌట్ పడుతున్నట్లు కనిపిస్తోంది.