సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ పై గెటప్ శ్రీను ఏమన్నారంటే..!!

ఈరోజు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన చిత్రాలలో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సందర్భంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గెటప్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. మెగాస్టార్ తో పాటు ప్రైవేట్ జర్నీ ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ఎన్నో ప్రమోషన్లలో పాల్గొన్న గెటప్ శ్రీను బాగా పాపులర్ అయ్యారు. ఇక ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది అని గెటప్ శ్రీను తెలియజేశారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా గురించే కాకుండా జబర్దస్త్ విషయంపై కూడా స్పందించారు. వాటి గురించి తెలుసుకుందాం.

Sudigali Sudheer : మాట తప్పుతున్న గెటప్ శ్రీను… కోపంతో సుడిగాలి సుధీర్‌..!  | Tufan9 Telugu News : Telugu News, తెలుగు వార్తలు - Tufan9.com
తెలుగులో బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు గెటప్ శ్రీను. ఇందులో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ,హైపర్ ఆది తదితరులు తమ పంచులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. ఇందులో కొంతమంది వెండితెర పైన పలు అవకాశాలు రావడంతో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు. అయితే సుడిగాలి సుదీర్ బయటికి వెళ్లడం వల్ల పెద్దగా వర్కౌట్ కాలేదని అంతేకాకుండా అవకాశాలు కూడా అంతగా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో తిరిగి జబర్దస్త్ లోకి రియంట్రి ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో గెటప్ శ్రీను ఈ విషయంపై అంగీకరించినప్పటికీ.. రాబోయే రోజుల్లో రియంట్రి సుధీర్ ఇస్తాడని హింట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. సుధీర్ రాక కోసం అందరం కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలియజేశారు గెటప్ శ్రీను. ప్రస్తుతం గెటప్ శ్రీను చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.