విజయ్ దేవరకొండ పరువు తీసేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ… షాకింగ్ కామెంట్స్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్‌ సినిమా తర్వాత కాస్త సైలెంట్ అయిపోయాడు. ఈ సంవత్సరం ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమా ఎవరు ఊహించని డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక దాంతో విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లైగర్ సినిమా విడుదలవక ముందు విజయ్- పూరి జగన్నాథ్ తో జనగణమన సినిమా స్టార్ట్ చేశాడు. సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు ఇద్దరు. ఇక లైగర్ సినిమా ప్లాఫ్ అవడంతో విజయ్ జనగణమన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు.

లైగర్ సినిమా విడుదలకు ముందు విజయ్ ఈ సినిమాకు ప్రమోషన్ల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండపై బాలీవుడ్ నటి మలోబిక బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో వెటకారపు వ్యాఖ్యలు చేసింది. ”ఆమె మాట్లాడుతూ విజయ్ నాతో కలిసి నప్పుడు హిందీ భాషను అవమానించాడని.. కానీ ఇప్పుడు మళ్ళీ విజయ్ అదే భాషలో లైగ‌ర్ సినిమాలో నటించాడు అంటూ సెటైర్లు వేసింది”. ఇక వీరిద్దరు’నీ వెనకాలే నడిచి’ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో ఐదేళ్ల క్రితం కలిసిన నటించారు.

Did Vijay Devarakonda insult Hindi | cinejosh.com

ఇక వీళ్లిద్దరూ కలిసి మ్యూజిక్ ఆల్బమ్ చేసే టైంలో షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఎక్కువగా తెలుగు ఇంగ్లీషులోనే మాట్లాడేవాడని.. ”నేను మాత్రం హిందీలో మాట్లాడేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే విజయ్ హిందీ భాషను అవమానించాడని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది”. ఒక కోనక టైం లో హిందీ అర్థం కాకపోవడంతో విజయ్ దేవరకొండ హిందీని ”హెబ్రో భాష అని వెటకారం చేసినట్లు కూడా మలోబిక బెనర్జీ చెప్పింది”. అలాంటిది ఇప్పుడు విజయ్ లైగర్ సినిమా హిందీలో చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది.హిందీలో అతను చెప్పే డైలాగ్స్ చూసి నాకు ఎంతో కామెడీగా అనిపించింది. ఈ సినిమాలో విజయ్ నత్తి సమస్య ఉన్న యువకుడిగ పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే. ఆ టైంలో హిందీని అవమానించిన విజయ్.. మళ్లీ లాస్ట్ కి హిందీలోనే సినిమా చేయాల్సి వచ్చిందని మలోబిక బెనర్జీ చెప్పుకొచ్చింది.