హవ్వ..పబ్ లో అందరి ముందే రామ్ గోపాల్ వర్మ అలా.. వైరల్ అవుతున్న వీడియో..!!

సినీ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైపోతాడు రాంగోపాల్ వర్మ . అసలకి అర్ధం కానీ విషయం ఏమిటంటే..కాంట్రవర్షీయల్ మ్యాటర్ ని ఆయన టచ్ చేస్తాడో.. ఆ మేటర్ ఆయన టచ్ చేసాకనే కాంట్రవర్షీయల్ గా మారుతుందో తెలియదు కానీ ..ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆయన మాట్లాడే మాటలు పద్ధతి వైరల్ గా మారుతూనే ఉంటుంది .

 

రీసెంట్గా ఆర్జీవి పబ్ లో ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా మళ్లీ ఆర్జీవి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రీసెంట్గా హైదరాబాద్లోని విచ్ ఆరెంజ్ మెంట్స్ కలిగిన ప్రిస్మ్ క్లబ్ లో నిన్న రాత్రి రాంగోపాల్ వర్మ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

 

హలో విన్ కాస్ట్యూమ్స్ లో యువతతో కలిసి ఎంజాయ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. అక్కడ డిజె సాంగ్స్ కి మాస్ స్టెప్పులేస్తూ బీభత్సంగా ఊగిపోతు మరీ ఎంజాయ్ చేశారు. ఫుల్ పార్టీ వైబ్స్ లో మునిగితేలారు . ఈ క్రమంలోనే అక్కడ దిగిన వీడియోని, ఫోటోలని అభిమానులతో పంచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ . ఈ క్రమంలోని దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు . కొందరేమో “కింగ్ సైజ్ లైఫ్” అంటుంటే.. మరికొందరు మనిషి అంటే నీలాగే ఉండాలి ..ఇష్టం వచ్చినట్లు జీవించడం నీ తర్వాతే.. నువ్వు దేవుడివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన సరే RGV లా ఒక్క రోజు బ్రతికినా చాలు అనుకునే జనాలు బోలెడు మంది ఉన్నారు.