అందరి ముందే ప్రభాస్ ని అన్నయ్య అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌..డార్లింగ్‌ ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!?

పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు.

ఆరు అడుగుల అందగాడు.. హైట్ కి తగ్గ వెయిట్ ..ఆ కటౌట్ కి పడిపోయే అమ్మాయిలు బోలెడు ముంది. మరి అలాంటి కటౌట్ గల ప్రభాస్ ని అన్నయ్య అనడం ఏంటి అంటూ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు . రీసెంట్ గా ఫరీయా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన సినిమా “లైక్ షేర్ సబ్స్క్రైబ్ “. ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపించారు . ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు .

 

కాగా ఈ క్రమంలోనే ఫైర్యా అబ్దుల్లా స్టేజ్ పై మాట్లాడుతూ ..”నా ఫస్ట్ సినిమా జాతి రత్నాలు ట్రైలర్ ని రిలీజ్ చేసింది ప్రభాస్ అన్నయ్య ..ఆ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది ప్రభాస్ అన్నయ్యనే.. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను ..ఈ సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుంది” అంటూ తనదైన స్టైల్ లో స్పీచ్ అదరగొట్టింది .

అయితే ప్రభాస్ ని అన్నయ్య అనడంతో స్టేడియం మొత్తం 2 నిమిషాల సైలెంట్ అయిపోయారు . ప్రభాస్ అన్నయ్యనా అంటూ షాక్ అయిపోయారు . దీంతో ఆమె స్పీచ్ వీడియో వైరల్ గా మారింది . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి జోడి బాగుంటుందని కలిసి సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు . చూద్దాం… మరి ఫరీయా అబ్దుల్లా తన అన్నయ్య ప్రభాస్ తో నటిస్తుందో లేదో..?