NTR 30:: ఎవరు ఊహించిన అప్డేట్.. ఇది నిజమైతే తారక్ ఫ్యాన్స్ కి పూనకాలే ..!!

NTR 30 To Get More Delay

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అప్డేట్ అభిమానులకు కొత్త ఉత్సాహాని ఇస్తుంది. ఎన్టీఆర్30వ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చినట్లుగా… సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కరలు కొడుతుంది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది.

కొరటాల దర్శకత్వంలో రాబోయే ఎన్టీఆర్ 30వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే ఈ యువ‌సుధ‌ ఆర్ట్స్ ట్విట్టర్ పేజీ అంటూ అందులో …. NTR30…” కింగ్ ఆన్ ది వే.. చాలాకాలం వెయిట్ చేయించినందుకు సారీ… ఇక టైం వచ్చేసింది.. రెండు రోజుల్లో బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుంది… రెడీగా ఉండండి… అగ్నిపర్వతం బద్దులయ్యేందుకు సిద్ధంగా ఉంది” అంటూ ఒక వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

NTR30: ఇక చాలు.. బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. నమ్మారో ఇక అంతే!

దీన్ని చూసిన వాళ్లు ఎన్టీఆర్ సినిమా అప్డేట్ వచ్చేస్తుంది అంటూ ఒకటే వార్తలు… నిజమైన అప్డేట్ అనుకుని ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ కి రిట్వీట్లు చేస్తూ… సోషల్ మీడియాని రఫ్ ఆడి చేస్తున్నారు… సరిగ్గా చూసిన ఫేక్ అకౌంట్ అని తెలియకుండా అంత కచ్చితంగా ఒరిజినల్ అకౌంట్ వాళ్ళు పెట్టినట్టు ఈ ట్వీట్ ఉండటం విశేషం. ఇది నిజమైన అప్డేట్ అనుకుంటే మాత్రం.. వాళ్లు పప్పులో కాలేసినట్టే… ఇది ఫేక్ అకౌంట్.

యువసుధ ఆర్ట్స్ ఒరిజినల్ ట్విట్టర్ ఖాతాలో అక్టోబర్ 5న‌ దసరా శుభాకాంక్షలు పెట్టిన ట్వీట్ తప్ప మరో ట్వీట్ లేదు.. అయితే ఈ ఫేక్ అకౌంట్ ద్వారా వరుసగా ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అభిమానులు ఏం చేయాలో అర్థం కాక వాళ్లే ఫేక్ అకౌంట్ల క్రియేట్ చేసి సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. మరి చూడాలి ఇది చూసి కూడా ఎన్టీఆర్ 30వ సినిమా గురించి మేకర్స్ అప్డేట్ ఇస్తారో లేదో.