కొరటాల శివ ఎన్టీఆర్ కోసం..ఆ యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపుతున్నాడా..!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో వీరే హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సమంత, పూజా హెగ్డే, కియరా అద్వానీ వంటి చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

ఇంతకీ ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఎవరు నటిస్తున్నారు లేదో అన్నది ఇంకా సినిమా యూనిట్‌కే క్లారిటీ లేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అందులో సెకండ్ హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ శ్రీ లీలను కన్ఫామ్ చేశారట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంటుందట.. ఆ లుక్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ తన పాత్ర కోసం చాలా కొత్తగా డిఫరెంట్ మేకోవర్ ను ట్రై చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 7 నుంచి 15 కిలోల బరువు కూడా తగ్గాడు.. కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హీట్ కొట్టాలని భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. ఆచార్యకి వచ్చిన తన నెగటివ్ పేరుని ఈ సినిమాతో హిట్‌ కొట్టి వారికి తన రేంజ్‌ నిరూపించుకోవాలని కొరటాల ఎంతో క‌సితో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.