మా అత్త అలాంటిదే…దీపిక మదర్ పై రణవీర్ ఊహించని కామెంట్స్..!!

యస్.. ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో తన అత్తగారి పై చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. మా అత్తగారికి నా పద్ధతులు నచ్చేవి కావు అంటూ..స్టార్ హీరో రణవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మనకు తెలిసిందే..బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్..స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ లవ్ బార్డ్స్ ఆ తరువాత పెళ్లి చేసుకుని ఒక్కటైయ్యారు.

వీళ్ల పెళ్ళి టైంలో నడిచిన హంగామ అంతా ఇంతా కాదు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అమ్మడి పెళ్లి వార్తలు హైలెట్ గా నిలిచాయి. ప్రజెంట్ ఇద్దరు బిగ్ ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నారు. అయితే తాజాగా రణవీర్ సింగ్ అత్తగారితో తన కనెక్షన్ కి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసాడు. ఆయన మాట్లాడుతూ..”నేను Trend కి తగ్గట్లు ఉంటాను..చాలా గట్టిగా .. బిగ్గరగా మాట్లాడుతాను. మెయిన్ నేను వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవుతూ అదే స్టైల్ ఫ్యాషన్స్ తో ఉండాలనుకుంటా. కానీ, ఇలాంటివి ఏవి మా అత్తగారింట్లో పనికి రావు. వాళ్ళది చాలా ట్రెడిషినల్ ఫ్యామిలీ”.

” నా పద్ధతులు ఏవి సాంప్రదాయ కుటుంబమైన దీపిక ఫ్యామిలీకి ఫస్ట్ లో నచ్చేవి కావు. ఆరంభంలో నా పద్ధతులు స్టైల్ వాళ్లకి అర్థం కూడా కాలేదట. మరీ ముఖ్యంగా దీపిక మదర్ కి నా బీహేవియర్ కి అస్సలు సింక్ కుదరలేదు. ఫస్ట్ లో చాలా కష్ట పడ్డను..వాళ్ళకు నచ్చిన్నట్లు ఉండటానికి. చాలా కాలం పాటు అత్తగారికి కనెక్ట్ కాలేకపోయా. అత్తారింటికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ సెన్స్ ని మెయింటెయిన్ చేసుకుంటూ వచ్చ. దాని కోసమే.. బెంగళూరులో ఉన్నప్పుడు తెల్లటి టీ షర్టు- నీలిరంగు జీన్స్ మాత్రమే ధరిస్తానని నా దగ్గర ఇప్పుడు రెండు వార్డ్ రోబ్ లు ఉన్నాయి”… అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాదు రణవీర్.