కొర‌టాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాక‌ర్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో తీస్తోన్న స‌లార్ పూర్త‌య్యాక పీకే – ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఇక ఎన్టీఆర్‌, కొర‌టాల సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఇప్ప‌టికే మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్‌తో ఎనౌన్స్‌మెంట్ అయ్యింది. టీజ‌ర్ అలా వ‌చ్చిందో లేదో వెంట‌నే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ సెట్టయ్యింది.

ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆతృత‌తో వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ స‌స్పెన్స్ గ‌త రెండు మూడు నెలుల‌గా అలాగే కొనసాగుతుంది. కానీ ఫైనల్ గా అయితే ఈ అవైటెడ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఎండింగ్ స్టేజ్‌లో ఉన్నాయి.

మేక‌ర్స్ అన్నీ ఫినిష్ చేసుకుని సెప్టెంబర్ నుంచి షూటింగ్‌ స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.