చ‌ర‌ణ్-శంక‌ర్‌ మూవీపై పెరిగిన అనుమానాలు..అస‌లేమైందంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. (Twitter/Photo)

నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌రై సంద‌డి చేశారు. అయితే ఈ ఈవెంట్ సినిమాపై మ‌రిన్ని అనుమానాలు పెరిగిపోయాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర ఉంద‌ని, ఆ పాత్రను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో చేయించ‌నున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ చరణ్, శంకర్ మూవీ. (Twitter/Photo)

అయితే తెలుగులో పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ రోల్ పోషించ‌నున్నార‌ని టాక్ న‌డించింది. కానీ, ఇప్పుడు ప‌వ‌న్ ప్లేస్‌లో చిరంజీవి పేరు వినిపిస్తోంది.దీనికి కారణం లాంఛింగ్ కు చిరంజీవి హాజరవ్వడమే. ఇక మ‌రోవైపు తెలుగులో ఆ రోల్ ర‌ణ్‌వీర్ సింగ్ చేస్తాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి లాంచింగ్ ఈవెంట్‌తో ఎన్నో అనుమానాలు తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆ స్పెష‌ల్ రోల్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారు అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి,బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, ప్రముఖ నిర్మాత పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Twitter/Photo)

 

Share post:

Popular