బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-5 ఈ షో మొదలైన రోజు నుంచే మొత్తం రచ్చ రచ్చ మొదలైంది.ఇక అంతే కాకుండా హౌస్ లో గొడవలు పడటం వంటివి ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇక ఇంతటితో లోపల ఉండే వారంతా ఒకరికి ఒకరు శత్రువులుగా అవుతున్నారు.ఇక తాజాగా ఆని మాస్టర్ కాళ్లు పట్టుకున్నాడు జస్వంత్.
ఇక తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ భాగంగా ఈ సీన్ హైలెట్గా నిలిచింది.దీంతో ఈ ప్రోమోను చూసినవాళ్లంతా జెస్సీని అమాయకుడని అనుకున్నాం కానీ అసలు రూపం ఏంటో బయటపడింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. జెసి కుర్చీలో కాళ్లు అడ్డుపెట్టుకొని కూర్చుని ఉండడంతో అనీ మాస్టర్ వచ్చి కాళ్లు తియ్యమని అనడంతో.. జెస్సీ ఆ మాస్టర్ మాటలు వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేశాడు. దీంతో ఆనీ మాస్టర్.. చాలా బాధ పడినట్లు తెలుస్తోంది.
అక్కడున్నవారంతా వీరిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి చూస్తే కానీ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరగడంతో అక్కడి నుంచి ఎవరు రూంకి వాళ్ళు వెళ్ళిపోయారు.ఇక కొద్ది సేపు తర్వాత జెస్సి ఆని మాస్టర్ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాడు. అంతేకాకుండా ఆమె కాళ్ళను కూడా పట్టుకున్నాడు. దీంతో జస్వంత్ పై నెగిటివ్ కామెంట్లు వస్తూ ఉండడం జరుగుతోంది.