ఆక‌ట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైల‌ర్..వెంకీ ప్ర‌శంస‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక‌గా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుద‌ల చేశారు.

Annabelle Sethupathi' sees Vijay Sethupathi, Taapsee Pannu team up for  horror-comedy - The Hindu

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉందని.. ట్రైలర్ చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. అలాగే సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని వెంకీ పేర్కొన్నారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే..`వీర సేతుపతి గారి కల్పనా చాతుర్యం ఆలోచనా విధానమే ఈ రాజమహల్ కు ఖ్యాతి తెచ్చింది` అంటూ ఓ బంగ్లాని చూపించడంతో ప్రారంభ‌మైన ట్రైల‌ర్ ఆధ్యంతం అల‌రిస్తోంది.

Annabelle Sethupathi' sees Vijay Sethupathi, Taapsee Pannu team up for  horror-comedy - The Hindu

ఒక అద్భుతమైన రాజమహల్ చుట్టూ తిరిగే హారర్ అండ్‌ కామెడీ చిత్ర‌మ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. అయితే హారర్ కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఖర్చు చేసినట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాధిక‌, వెన్నెల కిషోర్‌, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Share post:

Popular