నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వ‌ర్మ షాకింగ్ కామెంట్స్‌!

త్వ‌ర‌లోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది.

After his divorce with Keerthi Reddy, Sumanth Akkineni to get married for  the second time with a girl named Pavithra – Wedding card goes viral

అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌ర్మ స్పందిస్తూ.. `ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? సుమంత్‌. నీ కర్మ, ఆ పవిత్ర కర్మ. అనుభవించండి` అని పేర్కొన్నారు. దాంతో ఈయ‌న ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Keerthi Reddy | Keerthi Reddy Latest Pics | Tholi Prema Actress Keerthi  Reddy New Photos | Keerti Reddy Present Husband | Toliprema Actress Keerthi  Reddy | Pawan Kalyan Keerthi Reddy | - Filmibeat

కాగా, సుమంత్ 2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. కానీ, వీరి వివాహం బంధం రెండేళ్ల‌కే పెటాకులైంది. 2006లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకోగా.. ఆ త‌ర్వాత కీర్తి రెడ్డి మ‌రొక వ్య‌క్తం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత సుమంత్ రెండో వివాహం చేసుకోబోతుండ‌డంతో.. వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారాడు.

Karthik N Keerthi Reddy's Love Story Is Just As Normal As Ours - StarBiz.com

 

Share post:

Latest