రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన‌ హీరో సుమంత్‌!

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై సుమంత తాజాగా స్పందిస్తూ.. అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -

తాను రెండు పెళ్లి చేసుకుంటున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో రూపంలో సుమంత్‌ స్ప‌ష్టం చేశాడు. అయితే ప్ర‌స్తుతం తాను ఓ తెలుగు చిత్రంలో న‌టిస్తున్నాన‌ని..అందులో ఒకసారి విడాకులు అయిన త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంద‌ని సుమంత్‌ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ మూవీ షూట్ నుంచే ఓ వెడ్డింగ్ కార్డు లీక్ అయింద‌ని.. ప్ర‌స్తుతం అదే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో అంద‌రూ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని సుమంత్ వివ‌ర‌ణ ఇచ్చాడు. అలాగే త్వ‌ర‌లోనే తాను న‌టిస్తున్న సినిమా టైటిల్ మ‌రియు ఇత‌ర వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్న‌ట్టు పేర్కొన్నాడు. ఇక మొత్తానికి రెండో పెళ్లి అన్న వార్త‌లు కేవ‌లం పుకార్లే అని సుమంత్ తేల్చేశాడు.

Share post:

Popular