ఎన్టీఆర్ షోలో చ‌ర‌ణ్ ఎంత గెలిచాడో తెలుసా?

July 29, 2021 at 6:33 pm

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌రలోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చిన‌ట్టు ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

NTR to host Gemini TV's 'Evaru Meelo Koteeswarulu' | Indian Television Dot Com

ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింద‌ని.. ఆగ‌స్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ షోలో ఎన్టీఆర్ సంధించిన ప్రశ్నలకు చరణ్ త‌డ‌బ‌డ‌కుండా స‌రైన స‌మాధానాలు చెబుతూ.. రూ.25 ల‌క్ష‌లు గెలుచుకుంటాడ‌ట‌.

Ramcharan applauds his nieces for taking hygiene seriously | Telugu Movie News - Times of India

అంతేకాదు, తాను గెలుచుకున్న అమౌంట్ మొత్తాన్ని ఓ ఛారిటీకి చ‌ర‌ణ్ డోనేట్ చేస్తాడ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే.. మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఎన్టీఆర్ షోలో చ‌ర‌ణ్ ఎంత గెలిచాడో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts