అమెజాన్ కోసం ఇలియానా..?

ఈ మధ్య కాలంలో టాక్ షోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అందులోనా నటి నటులతో షోస్ చేయ‌డానికి ఛాన‌ళ్లు, ఓటీటీ సంస్థ‌లు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఆహా కోసం అక్కినేని స‌మంత ఓ షో చేసింది. త‌మ‌న్నాతో కూడా ఆహా ఓ షో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు బ్యూటీ భామ ఇలియానా కూడా ఇదే తోవలో నడుస్తుంది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయ‌బోతోంద‌ని వార్త ఎప్పటినుండో చక్కర్లు కొడ్తుంది.

ఇందుకు సంబంధించిన మాటలు కూడా అన్ని జ‌రిగిపోయాయ‌ట‌. దీని గోవా బ్యూటీ ఇలియానా భారీ పారితోషికం అందుకోబోతోంద‌ని టాక్. ఇలియానాకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ లోనూ అపుడప్పుడు మూవీస్ చేస్తోంది. గోవా సుందరి ఇలియానాకు పాన్ ఇండియా గుర్తింపు ఉండ‌డంతో, కాస్త పారితోషికం ఎక్కువైనా సరే ఆమెనే ఎంచుకొంద‌ట అమెజాన్.

Share post:

Latest