ఆ అమ్మాయి కాళ్లు ప‌ట్టుకున్న వైష్ణ‌వ్‌..ఫ‌న్నీగా`ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్!

మెగా మేన‌ల్లుడు వైష్ట‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతి శెట్టి న‌టించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. . ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.

బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలన్నర రోజుల తర్వాత డిలీటెడ్‌ సీన్స్‌ని ఒక్కక్కటిగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంది చిత్ర బృందం. తాజాగా రెండు డిలీటెడ్ సీన్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముఖ్యంలో కాలనీ అమ్మాయితో వైష్ణవ్‌ తేజ్‌ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది.

https://youtu.be/CXOTmlTxC1M

బేబ‌మ్మ‌కు లవ్ లెటర్ ఇప్పించడానికి హీరో పడే తంటాలు ఫ‌న్నీగా చూపించారు. ఈ సీన్ కోసం గోదారి జిల్లాలో పాడుకునే సరదా పాటను కూడా పెట్టాడు బుచ్చిబాబు. అంతేకాదు, బేబ‌మ్మ‌కు ల‌వ్ లెట‌ర్ ఇవ్వ‌మ‌ని కాల‌నీ అమ్మాయి కాళ్లు కూడా ప‌ట్టుకుంటారు. అలాగే విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీరియ‌స్ సీన్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి ఈ రెండు డిలీడెట్ సీన్లు అదిరిపోయాయి. కానీ, సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకొని వీటిని క‌ట్ చేసేశారు.

https://youtu.be/rd8U562rqZQ