ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

నాలుక చీరేస్తారట, ఎందీ నిజమేనా?

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారుగానీ, ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు పదవిలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ కారణంగా. అది ఆయన మర్చిపోతే ఎలా? రాజకీయాల్లో పార్టీ మారడం ఫ్యాషన్‌ అయిపోయింది. పార్టీ మారాక, కెసియార్‌ – తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కి ‘దేవుడైపోయారు’. అంతకు ముందైతే, కెసియార్‌ని పట్టుకుని నానా విమర్శలు చేసేసిన ఘనుడే ఈ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారు కూడా. తప్పదండీ, గారు అని సంబోధించకపోతే ఈయనగారికి ఒళ్ళు […]

యాక్షన్‌లోకి దిగుతున్న ఉండవల్లి

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లీగల్‌ విషయాల్లోకి దిగితే ప్రత్యర్థి ఎలాంటివారైనా సరే చిక్కుల్లో పడాల్సిందే. మీడియా మొఘల్‌ రామోజీరావుకే చెమటలు పట్టించారాయన. ఈసారి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్‌ అవబోతున్నారు. స్వతహాగా ఉండవల్లి న్యాయవాది. మంచి మాటకారి కూడా. ఆయన లాజిక్‌ లేకపోయినా, లాజిక్‌ ఉన్నట్లు మాట్లాడగలరు. ఓటుకు నోటు కేసు చాలా తీవ్రమైంది. రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఓటుకు నోటు అంశం తెరపైకి వచ్చినప్పటికీ, అందులో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. కేంద్రాన్ని […]

టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]

రాజకీయాల్లో సొంతిల్లు, అద్దె ఇల్లు

రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్‌. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు. రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం […]

పయ్యావులా? పరిటాలా?

ప‌య్యావుల కేశ‌వ్‌! టీడీపీలో అనంత‌పురానికి చెందిన సీనియ‌ర్ నేత‌! అన్న నంద‌మూరి తార‌క రామారావు ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌య్యావుల సైకిల్‌పైనే తిరుగుతున్నారు. త‌న తోటి వారు ఒక‌రిద్ద‌రు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసి  మ‌ళ్లీ వ‌చ్చి సైకిలెక్కినా.. ఈయ‌న మాత్రం అలాంటి జంప్‌లేవీ చేయ‌కుండా పార్టీలోనే ఉన్నారు. ఇక‌, ప‌దేళ్ల‌పాటు టీడీపీ విప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ ప‌య్యావుల పార్టీని వీడ‌లేదు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయ‌లేదు. దీనికితోడు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం స‌హా అనంతపురంలోనూ ప‌య్యావుల‌కు […]

అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు

కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి. రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు […]

ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్‌) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో […]

మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌

స్వతంత్ర దేశంలో అహింసాయుత నిర‌స‌న‌ల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీల‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వ‌ర‌కు అనేక రూపాల్లో అధికార ప‌క్ష ఎంపీలు, విప‌క్ష వైకాపా ఎంపీలు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక‌, వ్య‌క్తిగ‌తంగా కూడా కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మైపోయారు అధికార ప‌క్ష ఎంపీలు. ఇప్ప‌టికే చిత్తూరు ఎంపీ, సినీ న‌టుడు శివ‌ప్రసాద్‌.. […]