దేవర ఫాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. థియేటర్లోకి వచ్చేస్తున్న దావూదీ సాంగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా దేవర తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. రిలీజ్ కు ముందే ఇందులో అన్ని పాటలు డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దావూది సాంగ్ యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Devara Part 1 song Daavudi: Jr NTR and Janhvi Kapoor dance up a storm -  Hindustan Times

అత్యధిక వ్యూస్ సంపాదించి ట్రెండింగ్ లో నిలిచిన ఈ సాంగ్.. బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు ఎప్పుడు చూస్తామంటూ అభిమానులు ఎదురు చూసారు. అయితే ఆడియన్స్ అంతా.. ఎంతో ఆశగా ఎదురు చూసినా మాస్ సాంగ్ థియేటర్లో రాకపోవడంతో సగటు ప్రేక్షకులు నిరాశ చెందరు. కాగా కొన్ని అనివార్య కారణాలతో పాట సినిమా నుంచి తీసేసిన మేకర్స్.. తాజాగా దేవర అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం శుభవార్త చెప్పింది. ఈ పాటను సినిమాలో కలపబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

Daavudi: Janhvi Kapoor Shot Devara Song With Jr NTR Three Days After After  Hospital Discharge | Exclusive - News18

శుక్రవారం (ఈరోజు) నుంచి దేవర సినిమా ఆడుతున్న అన్ని స్క్రీన్ లలో ఈ పాట కూడా ప్రదర్శించబడుతుందని వెల్లడించారు. కొన్ని థియేటర్లలో ఈరోజు ఉదయం నుంచి సాంగ్ ప్లే చేయబడుతుందని.. దాదాపు అన్ని థియేటర్లలో సాయంత్రం సమయానికి పూర్తిస్థాయిలో పాట అందుబాటులోకి వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ నెటింట వైరల్ అవడంతో దేవ‌ర‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఈ సాంగ్‌కు అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ అందించ‌గా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.