సమంత.. నాని నటించిన ఎన్ని బ్లాక్ బ‌స్టర్ల‌ను రిజెక్ట్ చేసిందో తెలుసా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా సమంత మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరితోనూ ఆడిపాడింది. ఈ క్రమంలోనే వరుస‌ అవకాశాలు క్యూ కట్టడంతో.. కొన్ని సినిమాలను సమంత రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలా సమంత రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని తిరుగులేని ఇమేజ్ ఆ న‌టుల‌కు తెచ్చిపెట్టాయి. మరికొన్ని బోల్తా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.Watch Ninnu Kori Full movie Online In HD | Find where to watch it online on  Justdialఇకపోతే సమంత తన సినీ కెరీర్‌లో నేచురల్ స్టార్ నానితోను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ.. నాని హీరోగా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న రెండు సినిమాల్లో మాత్రం.. మొదట సమంతకే హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో.. సమంత ఆ సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల కారణాలేంటి ఒకసారి తెలుసుకుందాం. కొద్ది సంవత్సరాల క్రితం నాచురల్ స్టార్ నాని హీరోగా.. శివ నిర్వాణ డైరెక్షన్లో నిన్ను కోరి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో మొదట హీరోయిన్గా సమంతను భావించారట. టీం సమంతను కలిసి విషయం చెప్పగా వేరే సినిమాలతో ఆమె బిజీగా ఉండడంతో సినిమా చేయలేనని చెప్పి ఆ మూవీని రిజెక్ట్ చేసిందట.Ahead Of 'Dasara' Release, Take A Look At Nani's Best Performancesఇక గ‌తేడాది నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ అందుకున్న దసరా సినిమాలోను మొదట హీరోయిన్గా సమంతనే అనుకున్నారట. ఇక స్టోరీ కూడా మొదట సమంతకు వినిపించారట. కానీ ఇతర సినిమాల షూట్లలో బిజీగా ఉండడంతో ఆ సమయంలో కూడా దసరా సినిమాను రిజెక్ట్ చేసిందట సమంత. దీంతో ఈ సినిమాలో తర్వాత కీర్తి సురేష్‌ను హీరోయిన్గా తీసుకొని మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అలా నాని హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నిన్నుకోరి, దసరా ఈ రెండు సినిమాలను సమంత రిజెక్ట్ చేసిందంటూ సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ అవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ రెండు సినిమాల్లో సమంత నటించి ఉంటే తన మార్కెట్ మరింత పెరిగేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.