టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. తన అందం, అభినయం అమాయకత్వంతో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొని టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరు ముంబైలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ పలు వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ క్యూట్ ముద్దుగుమ్మ.. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న అదే క్యూట్ నెస్ తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.
ఇలాంటి క్రమంలో తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా మాట్లాడుతూ.. భర్త రితేష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆయన చాలా సింపుల్ పర్సన్. ఎంతో మంచి వ్యక్తి అంటూ వెల్లడించింది. నేను తీసుకున్న ఎన్నో మంచి నిర్ణయాల్లో రితేష్‌ను పెళ్లి చేసుకోవడం ఒకటి అంటూ వెల్లడించింది. ఇక రితేష్‌తో తాను డేటింగ్ చేసే సమయంలో ఎన్నోసార్లు షాక్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకున్న జెనెలియా.. మేము డేటింగ్ లో ఉన్న టైంలో షాకింగ్ సంఘటన జరిగిందని.. అది నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ చెప్పుకొచ్చింది. రితేష్ చాలా లేట్ గా నిద్రపోతాడు. నాకేమో త్వరగా నిద్రపోయే అలవాటు. ఓ రోజు సడన్గా అర్ధరాత్రి ఒంటిగంట టైంలో రితేష్ నాకు మెసేజ్ చేశాడు. అంతా అయిపోయింది.. ఇట్స్ ఓవర్ అంటూ ఓ బ్రేకప్ మెసేజ్ ను పెట్టాడు.. అది చూసి నేను షాక్ అయ్యా.. ఏం జరిగిందో తెలియక ఆవేదనకు గురయ్యా అంటూ వివరించింది.
ఎంతో బాధగా అనిపించింది.. అసలు విషయం తెలియక పిచ్చెక్కిపోయింది. అయితే రితేష్ నిద్రలేచిన తర్వాత మెసేజ్ గురించి మర్చిపోయి నాకు ఫోన్ చేశాడు.. ఏం చేస్తున్నావ్ అంటూ మాట్లాడడం మొదలు పెట్టాడు.. నాకు పిచ్చ కోపం వచ్చేసింది.. అసలు విషయం అడిగా కేవలం జోక్ గా మెసేజ్ చేశా అంటూ తాపీగా సమాధానం చెప్పాడంటూ జెనీలియా వెల్లడించింది. అది ఏప్రిల్ ఫుల్ డే.. (ఏప్రిల్ 1) కావడంతో ఆ రోజు నన్ను ఏప్రిల్ ఫూల్ చేయడానికి అలా పెట్టాడంటూ వెల్లడించింది. కాగా వీరిద్దరి మధ్య పరిచయం 2002లో మొదలైంది. ఇద్దరు కలిసిన నటించిన తేజ్ మేరీ కసం సినిమా టైంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డ ఈ జంట దాదాపు 10 ఏళ్ల డేటింగ్ తర్వాత 2012లో వివాహం చేసుకున్నారు.