టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రభాస్ సినీ కెరీర్‌లో మంచి సక్సెస్ అందించిన సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్గా నటించి మెప్పించారు. దశరధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో విశ్వనాథ్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ఇలా ఎంతోమంది ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని కలెక్షన్‌ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ కథను విన్నప్పుడు ప్రభాస్‌కు నచ్చలేదట. దీంతో సినిమాను రిజెక్ట్ చేశాడట. అయితే తర్వాత ఆ సినిమా నటించడానికి కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. గతంలో ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నిర్మాత అయిన దిల్ రాజు మాట్లాడుతూ ప్రభాస్‌కు మొదట మిస్టర్ పర్ఫెక్ట్ కథను వినిపించామని.. ఆ కథ విన్న ప్రభాస్‌కు ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది.
కానీ.. సెకండ్ పార్ట్ పెద్దగా నచ్చలేదని.. దాంతో నేను కాస్త టైం ఇవ్వండి సెకండ్ హాఫ్ కాస్త మార్పులు, చేర్పులు చేసి వినిపిస్తానని ఫోన్ చేస్తానని.. ఆయన మాత్రం కచ్చితంగా అసలు సినిమా చేయకూడదని ఫిక్స్ అయిపోయాడని వెల్లడించాడు. ఇక విని నచ్చలేదని చెప్పేద్దామని ఉద్దేశంతోనే ప్రభాస్ వచ్చారని.. కథ మొత్తం విన్న తర్వాత సూపర్ గా ఆయనకు నచ్చేసిందని. కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. దిల్ రాజు వెల్లడించాడు. తర్వాత ఆయనే దిల్ రాజుతో ఆ సినిమా అసలు చేయొద్దని చెబుదామని వచ్చాను.. కానీ సెకండ్ హాఫ్ మీరు చాలా బాగా డెవలప్ చేసి వినిపించారు. అందుకే సినిమాలో నటిస్తున్న అని ప్రభాస్ చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.