ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27(రేపు)న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. మరికొద్ది గంటలో ప్రీమియర్ షో పడనుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో ఎన్టీఆర్ మెప్పించనున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రలో యంగ్ టైగర్ ప్రేక్షకులకు కనిపించనున్నాడు. వర పాత్రకు జంటగా జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి క్యారెక్టర్ దేవరకు జోడిగా శృతి మరాఠీ నటిస్తోంది. అసలు ఈ శృతి మరాఠీ ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండదు.
ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో.. అసలు అమ్మే ఎవరో.. ఒకసారి తెలుసుకుందాం. గుజరాత్ కు చెందిన ఈ అమ్మడు కెరీర్ మోడలింగ్‌తో ప్రారంభించి.. తర్వాత మరాఠీ హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి అక్కడ ఆడియన్స్ కు దగ్గర అయింది. అంతేకాదు హిందీలోనూ పలు సీరియల్స్‌లో వెబ్ సిరీస్లలో కనిపించిన శృతి మరాఠీ.. సనై చౌఘడే అనే మరాఠి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆసమి తాసమి, లగాలి పైసు, రామ్ మాధవ్, ప్రేమసూత్ర ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మరాఠీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ను సొంతం చేసుకుంది. తమిళ్లోను పలు సినిమాలు ఆకట్టుకుంది. ప్రముఖ మరాఠీ యాక్టర్ గౌరవ ఘటనేకర్‌ను 2016 లో ప్రేమించి వివాహం చేసుకున్న శృతి.. తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా దేవర కావడం విశేషం.
ఫస్ట్ సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు ఈ సినిమాలో శృతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌కు ఈమెకు మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలవనున్నాయని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శృతి మరాఠి ఫోటోలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. కాగా కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించడం సినిమాపై మరింత బజ్ పెంచేసింది. ఈ క్రమంలో మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.