పవన్ నిర్మాతల మధ్య బిగ్‌ వార్.. అసలేం జ‌రిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2023లో మూడు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉండగా.. ఆ మూడు సినిమాల షూటింగ్లను పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరమైన పవన్.. దాదాపు ఏడాది నుంచి ఒక షూటింగ్లోను పాల్గొనలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో విజ‌యం సాధించిన‌ పవర్ స్టార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఉన్న బాధ్యతల రిత్యా కొన్ని నెలలపాటు షూటింగ్స్ కి పూర్తిగా దూరంగా ఉంటానంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ వంద రోజులు పూర్తయినా.. ఇంకా పవన్ ఫ్రీ కాలేదు.

Pawan Kalyan latest poster from OG powerful | cinejosh.com

ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో ఎప్పుడు పెండింగ్లో ఉన్న మిగతా సినిమా షూట్లను పూర్తి చేసి సినిమాలను రిలీజ్ స్టేజ్‌కు తీసుకు వస్తారో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోనే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ సినిమాను కొద్ది రోజులు పక్కన పెట్టే అవకాశం ఉందట. హరహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్లో పాల్గొని సినిమాలను పూర్తి చేయబోతున్నాడట. అయితే ఎప్పుడు ఏ సినిమా షూట్లో పాల్గొని సినిమాను పూర్తి చేస్తాడు.. అనే విషయంపై ఎవరికి క్లారిటీ లేదు. ఇక‌ మొదట ఓజి సినిమా షూట్ పూర్తి అయ్యి సినిమా రిలీజ్ అవుతుందంటూ ఓజీ టీం, మేకర్స్ చెబుతున్నారు. మార్చి నెలాకరులో రిలీజ్ డేట్స్ షెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే టైంలోనే విడుదల తేదీని ప్రకటించాలని ఆలోచనలో ఉన్నారట టీం. కానీ.. హరిహర వీరమల్లు మూవీ టీం మార్చి 28న తమ సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించేసింది.

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు రిలీజ్‌పై  సర్‌ప్రైజింగ్ న్యూస్

దీంతో సినిమా షూటింగ్ పూర్తికాలేదు.. అయినా సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడానికి చూస్తే పవన్ కళ్యాణ్ డేట్స్ మొత్తం వీళ్లే తీసుకునేలా ఉన్నారే అంటూ.. ఓజీ మూవీ మేకర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. హరిహర వీరమల్లు షూటింగ్లో చేయవలసిన సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఓజీలో మిగిలిన సీన్లు చాలా తక్కువని.. పవన్ కేవలం కొద్దిరోజులు కేటాయిస్తే ఓజీ షూటింగ్ పూర్తవుతుంది. ఓజీ సినిమాకి ప్రస్తుతం హైప్‌ కూడా ఎక్కువగా ఉంది. అది హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండడంతో తమ సినిమాని రిలీజ్ చేయాలని కష్టప‌డుతున్నారు మేక‌ర్స్‌. ఇక అదే విధంగా హరహర వీరమల్లు సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేప‌ధ్యంలో ఈ రెండు సినిమాల మేకర్స్ మధ్యన మినీ వార్‌ జరుగుతుందని.. తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి.