ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతుండడం.. అలాగే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మరింత హైప్ పెంచిన విషయం ఎన్టీఆర్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం. ఆమెకు టాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఎన్టీఆర్‌ను ఢీకొట్టే విలన్‌గా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఈ సినిమాను చూడాలని ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ 27న అంటే మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇలాంటి క్రమంలో దేవర సినిమాను కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌కి చూపించారట మేకర్స్. సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేవరా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని.. అక్కడక్కడ స్లో అనిపించిన యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సమాచారం.
ఇక సెకండ్ హాఫ్ మెల్లగా మొదలై మధ్యలో మంచి స్వింగ్ లోకి వస్తుందట. కొన్ని సన్నివేశాలు ల్యాగ్ ఫీలింగ్ కల్పించాయని.. చెబుతున్నారు. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందట. అయితే క్లైమాక్స్‌లో కథ మళ్ళీ పుంజుకుంటుందట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు తెలుగు ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ను కల్పిస్తాయని చెబుతున్నారు. ఇక అనిరుధద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఎన్టీఆర్ యాక్టింగ్.. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. సినిమాకు మరింత ప్లస్ పాయింట్స్ కానున్నాయ్ అంటున్నారు. ఇక కంటెంట్ ప్రకారం చూస్తే దేవర గత సినిమా.. ఆచార్య కంటే చాలా బెటర్ అని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని.. కామన్ ఆడియన్స్ ని కూడా సినిమా మెప్పిస్తుందని.. సినిమా చూసిన వాళ్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.