పౌజి సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఒక్కసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సరైన హిట్ కోసం చాలా కాలం సతమతమయ్యారు. ఇక చివరిగా తరికెక్కిన కల్కి సినిమాతో బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకొని మంచి జోష్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగైదు సినిమా లైన్ లో ఉంచుకున్న రెబల్ స్టార్.. నాలుగేళ్లు ఫుల్ బిజీగా గడపనున్నాడు.

ఇందులో భాగంగా మారుతి డైరెక్షన్లో రాజా సాబ్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2, హ‌ను రాఘవపూడితో ఫౌజి, అలాగే కల్కి 2 సినిమాను కూడా సెట్ చేసుకున్నాడు. అయితే హానురాగపూడి తో చేసే సినిమాకు సౌజి టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇంకా ఈ మూవీ టైటిల్ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కాగా ఈ మూవీ షూటింగ్ సీక్రెట్ గా మధురై లో జరుగుతుందట. కానీ.. ఇందులో క్లారిటీ లేదు. మరోవైపు మారుతితో రాజాసాబ్ షూటింగ్ నిర్‌విరామంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రభాస్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా హీరోగా రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్.. సినిమా హిట్ అయిన, ఫ్లాప్ అయినా రెమ్యూనరేషన్ లో ఎలాంటి మార్పు చేయలేదట‌.

అయితే హనురాగ‌వ‌పూడితో చేయబోయే సినిమా కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ కల్కి సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన డిమాండ్ రిత్యా.. ఇప్పటికే ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్, టాలీవుడ్ దర్శకులు చాలామంది క్యూక‌డుతున్నారని.. దీంతో ఫౌజీ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.