కేవలం నటించిన ఒక్క సినిమాతోనే ప్రేక్షకులను కటిపడేసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఈ అమ్మడు కూడా తన మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అచ్చ తెలుగు ఆడపిల్లల, పక్కింటి అమ్మాయిల కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. అవ్వడానికి మలయాళీ సోయగం అయినా అద్భుత నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. కట్టుబొట్టుతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఈ అమ్మడితో సినిమా చేయడానికి ప్రస్తుతం కుర్ర హీరోలంతా తెగ ఆరాట పడిపోతున్నారు.
ఇంతకీ ఈ పై ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. హీరోలకు సరి సమానంగా డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కంటెంట్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. గ్లామర్ పాత్రలకు ఎప్పటికప్పుడు దూరంగా ఉంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ అమ్మడు ఎవరో కనిపెట్టేసి ఉంటారు. ఎస్.. మి గెస్ కరెక్టే.. తనే సాయి పల్లవి. చారడేసి కళ్ళతో, అందమైన నవ్వుతూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. భానుమతి హైబ్రిడ్ పిల్ల అంటూ ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
ఈ అమ్మడు తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి సినిమాతోనే తన సహజ నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి.. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం లోను వరుస సినిమాలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చాలా సినిమాలతో బిజీగా గడుపుతుంది. అయితే మధ్యలో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన తిరిగి మళ్ళీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తు బిజీ అయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో సినిమాలో నటించనుందని టాక్. ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలో తాజాగా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్యూట్ లుక్స్ తో కనిపిస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ ట్రెండ్ చేస్తూ అమ్మడి అందాన్ని, అమాయకత్వాన్ని పొగిడేస్తున్నారు.