మెగాస్టారే లేకపోతే మీరంతా ఎవరు.. అల్లు ఫ్యామిలీ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేఖ బోజ్‌ రియాక్ట్ అవుతూ సంచల కామెంట్స్ చేసింది. ఈమె త‌న‌ సోషల్ మీడియా అకౌంట్లో అతి పెద్ద పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. మరి అంతలా ఎగిరి పడకండి.. స్వ‌యం ప్ర‌క‌టిత స్టార్ గారు.. ఈరోజు మార్నింగ్ టీవీలో ఛానల్ తిప్పుతుంటే ఒక దగ్గర పరమానందయ్య శిష్యులు కథ వస్తుంటే ఆపి చూసా. ఈ సినిమాలో శిష్యులుగా పద్మనాభంగారు, రాజబాబుగారు, అల్లు రామలింగయ్యగారు, సారధి గారు, పూర్ణచంద్రరావు గారు ఇంకా మిగిలిన వారి పేర్లు నాకు తెలియదు. వీళ్లంతా అప్పట్లో స్టార్ కమెడియన్స్. ఇంకా వీళ్లే కాదు.. తెలుగులో ఇంకొంతమంది ప్రముఖ కమెడియన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. రేలంగి గారు, రమణారెడ్డి గారు, అంజి బాలకృష్ణ గారు, వంగ‌ర‌ గారు ఇంకా కొందరి పేర్లు మిస్ అయ్యాను క్షమించండి.

Allu Arjun : ఆ పని చేయకుండా షూటింగ్స్ కి వెళ్ళను.. ఆర్యలో జరిగిన తప్పు మళ్ళీ నా లైఫ్ లో చేయలేదు.. | Allu arjun says about his dedication to work in arya 20 years event-10TV Telugu

ఇలా అల్లు రామలింగయ్య గారితో సమానమైన.. అంతకంటే పెద్ద స్టార్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌కు సినిమాలు మారిన తర్వాత.. వారికి అవకాశాలు పోయాయి. కానీ.. అల్లు రామలింగయ్య గారికి మాత్రం చనిపోయే వరకు అవకాశాలు ఆగలేదు. కారణమేంటి..? ఇంకా వీరిలో చాలామంది పేర్లు ఈ జనరేషన్ కి తెలియదు. రోడ్డుపైకి వెళ్లి జనరేషన్ పిల్లల్ని వాళ్ళ పేర్లు అడిగినా ఎవరు వాళ్ళు అని అడుగుతారు. బట్ అల్లు రామలింగయ్య గారి పేరు చెప్తే మాత్రం 90% మంది తెలుసని అంటారు. కారణం ఏంటి..? అంతేకాదు అలనాటి ప్రముఖ కమెడియన్స్ అందరి వారసులు ఒక్కరంటే ఒక్కరు కూడా అస్సలు ఎక్కడున్నారో..? వాళ్ళు ఎవరో..? ఏం చేస్తున్నారు..? కూడా తెలియని పరిస్థితి. కానీ అల్లు వారసులుగా వచ్చిన అల్లు అరవింద్ గారు.. మరియు మనవాళ్లు అందరూ ఓ రేంజ్‌లో ఉన్నారు ఎందుకు బాబు..? పుష్పా స్టార్ ఫ్యాన్స్.. ఇప్పుడు చెప్పండి.

ఎవరి లైఫ్ లోకి.. ఎవరు..? వస్తే ఎవరి..? జీవితాలు బాగుపడ్డాయి. ఆయన మీతో చుట్టరికం చేయడమే కాకుండా.. తమ ప్రేమ, స్నేహాన్ని పంచుతూ ఎలాంటి పక్షవాతం లేకుండా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటే నిస్వార్ధంగా తన లెగసీని మీకు కూడా షేర్ చేశారు. మీరు నిలబడేంత వరకు మీతో ఆ ఫ్యామిలీ నిలబడ్డారు. మీరు కాస్త నిలదొక్కుకునేదాకా మీ ఫంక్షన్స్ అన్నింటికీ ఆయన, లేదా పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చారు. ఆయన మొహం చూసి ఆయన కుటుంబంలో స్టార్స్.. ఆయన్ని ప్రాణంగా భావించే ఫ్యాన్స్.. కూడా మీకు అండగా ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే వీడు మావోడు అని మొదటి సినిమా నుంచి కోట్ల మంది అండగా నిలబడడానికి కారణం మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళని తిడుతున్న ఒక్కడైనా నీ మొదటి సినిమాని థియేటర్లో చూసారేమో అడగండి.

కానీ.. మీరు మాత్రం ఆయనతో.. ఆయన అభిమానులతో.. జస్ట్ బిజినెస్ చేశారు. ఆయనతో ఆ ఫ్యామిలీతో వ్యాపారం లేదని పూర్తిగా క్లారిటీ వచ్చాక మీ రియాలిటీ బయటకు తీసుకువచ్చారు. చిరంజీవి గారే లేకపోతే మీరంతా ఎక్కడ ఉండే వాళ్ళో.. ఒక్కసారి మిగతా కమెడియన్ వారసులను చూసి క్లారిటీ తెచ్చుకోండి.వాళ్ళ‌ లాగా.. మీ పేర్లు అడ్రస్ లేకుండా మాకు ఈ రోజున తెలిసి ఉండకుండా ఉండేది. మీరంతా ఒక్కసారి కింద వీడియో చూస్తే ఒకప్పుడు మీ హీరో ఎలా ఉన్నాడు.. ఏమన్నాడు మీకు అర్థమవుతుంది. మీరు ఆలోచించుకోండి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను చెప్పింది నిజమా.. కాదా.. అంటూ లాంగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ఇక ఈ రైట్ అప్ ఎవరిని కించపరచడానికి రాయలేదని.. జస్ట్ నిజాలను బయట పెట్టడానికి మాత్రమే రాసా.. ఇతర కమెడియన్స్ వారసులు ఎవరు ఇప్పుడు బాలేరన్నది నా ఉద్దేశం.. వారెవరో ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు తెలియదన్న పాయింట్ వరకే ఇవి వర్ణించా అంటూ ఆమె పోస్ట్ ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన పోస్ట్ వైరల్ అవ్వడంతో.. నిజమే కదా అప్పటి మెగాస్టార్ బ్యాక్ గ్రౌండ్ కారణంగానే అల్లు ఫ్యామిలీ కూడా అంచలంచలుగా ఎదిగింది. ఇప్పుడు వారు మేమే పెద్ద తోపులం అంటున్నారు అంటూ.. బన్నీ పై జనం ఫైర్ అవుతున్నారు.