కేవలం బాలయ్యకు మాత్రమే సొంతమైన రేర్‌ రికార్డ్‌.. పాన్ ఇండియన్ స్టార్‌లు కూడా టచ్ చేయలేకపోయారే..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు నటసింహం బాలకృష్ణ. ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకొని రికార్డులు సృష్టించిన బాలయ్య.. ప్రస్తుతం వరుస హాట్రిక్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే అలాంటి బాలయ్య కెరీర్‌లో నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంవత్సరం ఒకటి ఉంది. అది అభిమానులకే కాదు.. బాలయ్యకు కూడా ఎంతో స్పెషల్. ఇంతకీ అది ఏ సంవత్సరం.. ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా.. అదే 1986. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో రికార్డ్‌ సృష్టించే బాలయ్య.. ఆ ఏడాదిలో ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రేర్ రికార్డును ఇప్పటివరకు ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయాడు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

ముద్దుల కృష్ణుడు (1986) | ముద్దుల కృష్ణుడు Movie | ముద్దుల కృష్ణుడు Telugu  Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

ముద్దుల కృష్ణయ్య
అలనాటి దిగ్గజ డైరెక్టర్ కోడి. రామకృష్ణ – బాలయ్య కాంబోలో తెర‌కెక్కిన ఈ సినిమా.. అప్పట్లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్య ఇద్దరు.. హీరోయిన్ల గ్లామర్ సినిమాకు మరింత ప్లస్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్‌ సాధించింది. ఏ రేంజ్ లో అంటే ఏకంగా ఫస్ట్ వీక్ లోనే కోటి రూపాయల గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టింది.

బాల‌య్య `సీతారామ క‌ళ్యాణం`కి 36 వ‌సంతాలు!

సీతారామ కళ్యాణం
ఇదే ఏడాదిలో బాలయ్య నటించిన మరో సినిమా సీతారామ కళ్యాణం. కాలేజీ కుర్రాడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించాడు. కామెడీ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన జంధ్యాల.. పగా ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య.. ఓ అద్భుతమైన ప్రేమ కథను క‌లిపి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో వచ్చే రాళ్ళల్లో.. ఇసుకల్లో.. సాంగ్ అప్పట్లో ఒక సందేశం. ఇప్పటికీ ఈ పాటను.. ఎంతో మంది వింటూనే ఉంటారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 15న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆడియన్స్ రెండు సినిమాలకు అప్పట్లో బ్రహ్మ రథం పట్టారు.

Anasuyamma Gari Alludu Songs Free Download 1986 Telugu

అనసూయమ్మ గారి అల్లుడు
నందమూరి బాలయ్య హీరోగా.. సోదరుడు హరికృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ అనసూయమ్మ గారి అల్లుడు సినిమాలో సీనియర్ నటి శారదా అనసూయ పాత్రలో నటించి మెప్పించింది. ఆమె అడుగు జాడల్లో నడిచే కూతురుగా భానుప్రియ ఆకట్టుకుంది. ఫ‌న్‌.. ఎంటర్టైనర్ గా సాగిన ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక సినిమా 200 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. సినిమా స్క్రీప్ట్‌ పరుచూరి బ్రదర్స్ ఒక్కరోజులోనే కంప్లీట్ చేయడం రికార్డ్.

దేశోద్ధారకుడు

అప్పటికే హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఈ సినిమాల తర్వాత నటించిన మూవీ దేశోద్ధారకుడు. ఆగస్టు 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఖాతాలో మరో సక్సెస్ వేసింది. దీంతో అభిమానుల్లో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే బాలయ్య కోసం ఏకంగా 108 అడుగుల పొడవు.. 45 అడుగుల వెడల్పు గల కటౌట్ ను ఏర్పాటు చేసి మరి సినిమా ఓపెనింగ్ డే సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.5 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది.

కలియుగ కృష్ణుడు (1986) | కలియుగ కృష్ణుడు Movie | కలియుగ కృష్ణుడు Telugu  Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

కలియుగ కృష్ణుడు
అదే ఏడాదిలో రిలీజ్ అయిన మరో సినిమా కలియుగ కృష్ణుడు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య 30 గా వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో బ్లాక్ భాస్కర్ అందుకుంది. ఇందులో డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Apoorva Sahodarulu : బాలయ్య ఫస్ట్ డ్యుయెల్ రోల్ సినిమాకు 35 ఏళ్లు | Apoorva  Sahodarulu | Balakrishna apoorva sahodarulu movie completes 35 years-10TV  Telugu

అపూర్వ సహోదరులు
అదే ఏడాదిలో రిలీజ్ అయిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. రామ్, అరుణ్ అనే రెండు పాత్రలో.. పంచులు, ఫైట్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలయ్య. కె. రాఘవేంద్రరావు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా వచ్చిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. దసర‌ కానుకగా అక్టోబర్ 9న రిలీజ్ అయిన ఈ మూవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాతో ఒకే ఏడాదిలో డబ్బులు హ్యాట్రిక్ అందుకున్న బాలయ్యకు 1986 గోల్డెన్ ఇయర్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పటివరకు బాలయ్య ఒకే సంవత్సరంలో సాధించిన ఈ రికార్డును ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయాడు.