తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్‌. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.

Ramayya Vastavayya HQ Movie Wallpapers | Ramayya Vastavayya HD Movie  Wallpapers - 11754 - Oneindia Wallpapers

అలా నందమూరి కుటుంబంలో కూడా బాబాయి బాలయ్యకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చి.. అబ్బాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ హీరోయిన్ డిజాస్టర్ ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. ఇంతకీ ఆమె ఎవరో కాదు లోకనాయకుడు కమల్ నటవరసరాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. ఈ అమ్మడు కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తావయ్య సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Veera Simha Reddy - Suguna Sundari Video | Nandamuri Balakrishna | Shruti  Haasan, ThamanS - YouTube

ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. ఇక ఎన్టీఆర్ బాబాయి బాలయ్యతో శృతిహాసన్ వీర సింహారెడ్డి సినిమాలో నటించింది. బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది రిలీజై బ్లాక్ మాస్టర్ సక్సెస్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో బాబాయ్ కు హిట్ ఇచ్చిన శృతి.. అబ్బాయికి మాత్రం అన్యాయం చేసిందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.