అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజౌ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో నటించిన రష్మిక మందన, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, పాహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్ లాంటి వారందరూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇంత మంచి కంటెంట్‌తోతెరకెక్కిన పాన్ ఇండియన్ హిట్ సినిమాను.. ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారంటూ.. ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ పుష్ప లాంటి ప్రతిష్టాత్మక సినిమాను రిజెక్ట్ చేసిన ఆ దురదృష్టవంతులు ఎవరు ఒకసారి తెలుసుకుందాం.
బుల్లితెర హీరోగా రవికృష్ణ మంచి పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తర్వాత బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకొని లక్షలాదిమంది హృదయాలను గెలుచుకున్నాడు. హౌస్‌నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవి కృష్ణ.. పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు సుకుమార్ అప్రోచ్ అయ్యారట. అప్పటికే లవ్ మీ ఇఫ్ యు దేర్ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను ఇష్టం లేకపోయినా రిజెక్ట్ చేశాడట రవి కృష్ణ.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిబాబు.. ఈ నటుడుకి పుష్పా సినిమాలో నటించే మంచి ఛాన్స్ వచ్చిందట. కానీ బన్నీతో నటించడం ఇష్టం లేక రిజెక్ట్ చేశాడట. పుష్ప సినిమాల్లో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటిచ్చిన జగదీష్ రోల్ కోసం మొదట బిగ్బాస్ నుంచి బయటకు వచ్చి మంచి పాపులారిటీ దక్కించుకున్న మహేష్ విట్టాను తీసుకోవాలని భావించారు. అయితే ఏవో కారణాలతో మహేష్ ఈ సినిమా చేయలేకపోయారు. దీంతో హీరో సుహాస్‌ని హీరో కోసం తీసుకుందాం అనుకున్నారట. కానీ ఆయన కూడా ఈ సినిమాలో చేసే అవకాశాన్ని మిస్ అయ్యారు.
చివరకు జగదీష్ ఈ పాత్రలో నటించి స్టార్‌డం సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ రోల్ అవకాశం వచ్చిన దానిని రిజెక్ట్ చేశాడట. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం మొదట సమంతను తీసుకోవాలని భావించారట. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో బిజీగా ఉన్న సమంత.. సినిమా రిజెక్ట్ చేసింది. ఇక స్పెషల్ సాంగ్ కోసం దిశపటనిని భావించారట.
కానీ ఆమె దానిని రిజెక్ట్ చేసింది. అయితే హీరోయిన్‌గా నటించకపోయినా.. ఐటెం సాంగ్ కోసం మాత్రం సమంత సినిమాలో వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సమంత సాంగ్ మరింత హైలెట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ ఈ సినిమాను ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.