నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలే. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాలయ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య చాలామంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. పై ఫోటో మీరు గమనించారా..? ఆ ఫోటోలో బాలయ్యతో పాటు ఒక బాలుడు.. ఒక చిన్నారి ఉన్నారు.
బాలయ్య పక్కన ఉన్న ఆ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. బాలయ్య సినిమాలో బాలనట్టిగా చేసిన ఆమె ఆ తర్వాత బాలయ్య సినిమాలో.. బాలయ్య పక్కన హీరోయిన్గా కూడా చేసింది. చాలా షాక్ అవుతున్నారా. ఇది నిజం కూడా. పై ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ రాశీ. ఒకప్పుడు కుర్రాళ్లను తన అందంతో కవ్వించింది రాశి. పై ఫోటో బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన బాలగోపాలుడు సినిమాలోది. ఈ సినిమాలో బాలయ్యతో రాశి బాలనట్టిగా నటించింది.
అలాగే ఆ పక్కనే ఉన్న బాబు ఎవరో కాదు.. నందమూరి కళ్యాణ్‌రామ్. వీరిద్దరూ కలిసి ఆ సినిమాలో బాలనట్టులుగా నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా చేసిన కృష్ణ బాబు సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్గా చేసింది రాశి. ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. ఇక ఇప్పుడు రాశి సినిమాలకు దూరంగా ఉంటూ.. పలు సీరియల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని సినిమాలలో అమ్మగా, అత్త పాత్రలలో కూడా నటిస్తోంది. ఒకప్పటి ఈ బ్యూటిఫుల్ హాట్ హీరోయిన్.. బిజినెస్‌లో కూడా రాణిస్తోంది.