జయలలితపై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్..!

తమిళ ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తమిళనాడు మాజీ సిఎం జయలలిత ఎంతగానో కష్టపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలలితను ఒక అసాధారణమైన పరిపాలకురాలుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ గుర్తు చేసుకున్నారు.PM Narendra Modi warns demographic change bigger threat to social harmony  than infiltration - India Todayప్రజా సంక్షేమం కోసం పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకురాలు జయలలిత అని, ఆ మనస్తత్వం ఉన్న న్నాయకులకు ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతారన్నారు. అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలు అని కొనియాడారు. ప్రజల అభ్యన్నతికి జయలలిత ఎంతగానో కృషి చేసారని, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిది అంటూ ప్రశంసించారు. జయలలిత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఓ మైలురాయిగా అభివర్ణించారు.J. Jayalalithaa – National Legislator Conference Bharat 2023 | NLC Bharatజయలలిత పరిపాలనలో, వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో స్పష్టంగా ఉండేవన్నారు మోడీ. జయలలిత జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని కొనియాడిన ప్రధాని, 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జయలలిత హాజరు అయ్యారని, ఆ తర్వాతి నుంచి తమ స్నేహం కొనసాగిందన్నారు. ఓ సారి పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి కూడా ఆహ్వానించారని మోడీ తెలిపారు. ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేననని, సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.