60 ఏళ్ళ వయసులో అలాంటి సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా ఫిట్గా ఉంటూ తన లుక్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ ఆఫ్ మాస్, యాక్షన్ కంటెంట్ తో.. పేపర్ ఫుల్ డైలాగ్లతో మెప్పిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. మంచి జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన.. తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది.

దీంతో.. బాలయ్య విషయంలో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. దాదాపు ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు కచ్చితంగా జనాలకు ఉపయోగపడాలని.. లేదా ఎంటర్టైనింగ్ గా ఉండాలని.. చూస్ చేసుకుంటూ వచ్చారు. పిచ్చిపిచ్చి కంటెంట్కు ఆయన చాలా దూరంగా ఉన్నారు. అన్ స్టాపబుల్ షో తో జనాలకు మరింత దగ్గరైన బాలయ్య.. ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే.. తాజాగా బాలయ్య లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఇందులో లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది.

Harish Shankar To Team With Balakrishna | cinejosh.com

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య ఈ సినిమాలో నటించబోతున్నాడట. అయితే.. ఈ సినిమాలో బాలయ్య ఎప్పటిలా మాస్ లుక్‌లో కాకుండా.. సరికొత్త యాంగిల్‌లో ఇప్పటి వరకు చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఫుల్ లవ్‌థీంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య నటించటం అంటే.. కచ్చితంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా ఆరు ప‌దుల‌ వయసులో లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుని.. లవర్ బాయ్‌గా కనిపించడం అసలు ఆడియన్స్‌కు నచ్చుతుందా.. లేదా.. అసలు ఈ కంటెంట్ వర్కౌట్ అవుతుందా.. అనే టెన్షన్ నందమూరి ఫ్యాన్స్ లో మొదలైంది.