సిన్ ఇండస్ట్రీలో స్థానం సాధించి సెలబ్రిటీగా మారాలని ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగు పెడుతుంటారు. అయితే సక్సెస్ అనేది అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టం ఎన్నో అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారు. మరి కొంతమంది ఇండస్ట్రీలో వచ్చే అవాంతరాలను ఎదుర్కోలేక వెనుతిరిగి వెళ్ళిపోతారు. అలా.. ఇప్పటికే ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్టార్ హీరో, హీరోలు, దర్శకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు కష్టాలను ఎదుర్కొన్నవారే. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో సీరియల్ దర్శకుడిగా వ్యవహరించిన రాజమౌళి.. తర్వాత ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం అయ్యి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఇక్కడి నుంచి మొదలు.. రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలతో సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లోను సత్తా చాటుకుంటున్నాడు రాజమౌళి. ప్రస్తుతం బాలీవుడ్‌లో సైతం తన మార్క్ చూపిస్తూ మరిన్ని సక్సెస్లను సాధించడం లక్ష్యంగా రాణిస్తున్న జక్కన్న.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి సత్తా చాటుకుని పాన్ వరల్డ్ రేంజ్‌లో తన మార్క్‌లు క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇలాంటి క్రమంలో రాజమౌళి సినిమాల్లో మెగాస్టార్ ఫేవరెట్ సినిమాల లిస్ట్ ఒకటి వైరల్ గా మారుతుంది. నిజానికి.. మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఎంతో గొప్పగా ప్రశంసలు కురిపించాడు.
ఇందులో భాగంగానే రాజమౌళి చేసిన సినిమాల్లో తనకు ఎన్టీఆర్ సింహాద్రి సినిమా అంటే చాలా ఇష్టమని.. ఈ సినిమాలో రాజమౌళి ఎమోషన్స్ తో ఆట ఆడుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాజమౌళి కొత్త డైరెక్టర్ అయ్యుండి ఇంతలా సినిమా తీయడం చూసి ఆశ్చర్యపోయాడట చిరంజీవి. సినిమా తర్వాత ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర లాంటి సినిమాలు చిరంజీవికి ఫేవరెట్ సినిమాలని.. మొత్తానికి ఆయన సినిమాల్లో సగం సినిమాలు చిరంజీవికి బాగా నచ్చేస్తాయంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక రాంచరణ్ రాజమౌళి డైరెక్షన్లో చరణ్‌ను నటింపజేయాలని ఆలోచన కూడా చిరంజీవికి రావడానికి కారణం రాజమౌళి విజన్ అట. అలా.. చిరు రాజమౌళి సినిమాల్లో ఈ నాలుగు సినిమాలను ఎంతగానో ఇష్టపడతాడని తెలుస్తుంది.