సినీ ఇండస్ట్రీలో లవ్, ఎఫైర్, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఇలాంటివన్నీ చాలా కామన్ గా వినిపిస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లకు మధ్యన ప్రేమాయణం నడుస్తుందంటూ వార్తలు రావడం.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని.. ఫిజికల్గా కూడా బంధం ఏర్పడిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. తర్వాత వాళ్ళు బ్రేకప్ చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఎక్కువగా వైరల్ గా మారుతుంది.
స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అంతే కాదు విజయ్‌తో డేటింగ్ చేసిన ఈ అమ్మడు.. అఫీషియల్ గా కూడా దీన్ని ప్రకటించింది. కానీ.. ఏమైందో ఏమో తెలియదు వీరిద్దరూ విడిపోయారని.. బ్రేకప్ చెప్పేసుకున్నారు అంటూ.. ఇండస్ట్రీలో వేరే నటుడితో తమన్నా క్లోజ్ గా ఉంటుందంటూ రకరకాల వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలపై తమన్న కానీ.. ఇటు విజయవర్మ కానీ.. ఎవరు రియాక్ట్ కాకపోవడం నెటింట హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న.. ఈ ప్రేమ, పెళ్లి విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. విజయ్ వర్మతో త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో తమన్న ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం బ్రేకప్ అయిపోయింది అన్న వార్తను కప్పిపుచడానికి ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. తమన్న అభిమానులు మాత్రం తమన్న తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్ అని.. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమన్న పెళ్ళి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.