ఆ మ్యాటర్ లో విజయ్ దళపతి, ఎమ్.ఎస్.ధోనీలనే బీట్ చేసిన సాయి పల్లవి.. ఇదెక్కడికి క్రేజ్ రా సామి..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అమ్మడి నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే న‌టిగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఇటీవల అమరాన్, తండేల్‌తో వరుస‌ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లోను సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. సాయి పల్లవి బాలీవుడ్‌ రామాయణంలో నటిస్తుంది.

Sai Pallavi (@saipallavi.senthamarai) • Instagram photos and videos

ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరో కాగా.. సాయి పల్లవి హీరోయిన్గా మెరవనుంది. ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఓ సర్వే ప్రకారం సాయి పల్లవి గురించి ఆడియన్స్ అంతా తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపుతున్నారట. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీలను మించి పోయే రేంజ్ లో ఈమె క్రేజ్‌ దక్కించుకుందని టాక్.

ఇన్‌స్టాగ్రామ్‌లో దేశవ్యాప్తంగా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి 20 శాతం మంది, ఎంఎస్ ధోని గురించి 17 శాతం మంది తెలుసుకోవాలని ఆరాటపడుతుంటే.. సాయి పల్లవి గురించి తెలుసుకోవాలని ఏకంగా 25 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు ఈ సర్వేలో వెళ్లడైంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఈ రేంజ్ క్రేజ్‌ దక్కించుకోలేదు. ఈ రికార్డ్‌ కేవలం సాయి పల్లవికి మాత్రమే సొంతమైంది. మిగిలిన సెలబ్రిటీలు చాలామందిని కేవలం ఐదు శాతం మంది మాత్రమే ప్రభావితం చేస్తుంటే.. సాయి పల్లవి గురించి తెలుసుకోవాలని ఈ రేంజ్ లో ఆసక్తికరచడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మడి క్రేజ్ ఏంటో క్లియర్ గా తెలుస్తుంది.