టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజా ఉగాది సెలబ్రేషన్స్‌లో భాగంగా పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ ఈ విషయం అఫిషియల్‌గా ప్రకటించారు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పూరీ జగన్నాథ్. కేవలం దర్శకుడిగానే కాకుండా.. రచయిత, నిర్మాతగాన ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కాగా పూరి గత సినిమాలు లైగర్, ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్‌గా నిలిచాయి.
ఇలాంటి క్రమంలో మహారాజా, విడుదల పార్ట్ 2 సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ సేతుపతితో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు పూరీ. ప్రస్తుతం ఏస్, ట్రైన్ వంటి సినిమాలో నటిస్తున్నారు. దీంతో సేతుపతి.. ఫ్లాప్ లలో ఉన్న పూరికి ఛాన్స్ ఇవ్వడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ.. పూరి మేకింగ్ గురించి బాగా తెలిసిన ఫ్యాన్స్.. ఆయన కమ్ బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ బ్లాస్టే అంటూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే పూరి – విజయ్ కాంబోలో రానున్న సినిమా గురించి ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది.
కాగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారంప్రకారం ఈ సినిమా కోసం పూరీ మాస్టర్ స్కెచ్ వేసినట్టు టాక్. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్రలో మెరవనుందట. సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం పూరి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో టబు సైతం ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందట. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్ టబు.. చాలా కాలం తర్వాత పూరి, విజయ్ సినిమా కోసం సౌత్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుందట. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.