మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అంతికాడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా పూర్తయింది అంటూ మాళవిక ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. దీనిపై పలు ట్రోల్స్ ఎదురయ్యాయి. మోహన్లాల్ మాళవిక మధ్య వయసు వ్యత్యాసం గురించి కామెంట్లు వినిపించాయి.
దీంతో తన గురించి వచ్చిన నెగటివ్ కామెంట్స్ పై మాళవిక స్ట్రాంగ రియాక్ట్ అయింది. నువ్వు ఇలా మనుషులను ఎలా తూకం వేస్తావో తెలుసా.. అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది. ఇక మాళవిక మోహన్ నటుడు మోహన్లాల్ తో కలిసి సెట్స్ లో సందడి చేసిన పిక్స్ ను షేర్ చేసుకుంది. మోహన్లాల్ సార్, సత్యం సార్ మీలాంటి గొప్ప వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నా.. సినిమాలో వీళ్లు చేసే మ్యాజిక్ నన్ను ఆకట్టుకుంది అంటూ వివరించింది.
టాలెంటెడ్ నటులతో కలిసి పని చేశాను. అందమైన టేక్కడిలోని కొండలు, తేయాకు తోటల్లో సంతోషంగా ఓ నెలా గడిపాను అంటూ చెప్పుకోచింది. ఈ క్రమంలోనే ఏజ్ ట్రోలింగ్ పై తను వేసిఏన కౌంటర్ తెగ వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం మాళవిక.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాళవిక పోస్ట్ మరింత వైరల్గా మారుతుంది.