మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ పెద్ది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా గ్లీంప్స్ నిన్న శ్రీరామనవమి సందర్భంగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఏకంగా 24 గంటల్లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇప్పటివరకు రిలీజైన స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నింటికంటే చరణ్ పెద్ది సినిమా గ్లింప్స్ ఎక్కువ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే.. 21 గంటలలో 30.8 మిలియన్ వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పటివరకు టాప్ లో ఉన్న దేవర, పుష్ప 2 రికార్డులు కూడా చిత్తుచిత్తు అయిపోయాయి. ఈ క్రమంలోనే చరణ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు వస్తున్న రెస్పాన్స్ చూసి మూవీ టీం సైతం ఆనంద పడుతుందని.. రామ్ చరణ్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాలలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా 30.8 మిలియన్ వ్యూస్‌తో పెద్డి మొదటి వరుసలో నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత 26.17 మిలియన్ వ్యూస్‌తో దేవర 2వపొజిషన్‌లో ఉంది.
20.98 వ్యూస్‌తో గుంటూరు కారం3వ స్థానం , 20.45 మిలియన్ వ్యూస్‌తో పుష్ప 2 4వ స్థానం, 17.12 మిలియన్ న్యూస్ తో ది పారడైజ్ 5వ స్థానం దక్కించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాయి. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలోనూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో చరణ్ తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని.. చరణ్ సినిమాలో తన మార్క్ నటనతో మరోసారి సత్తా చాటుకోనున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ చేయనున్నారు టీం.