నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి రికార్డు సృష్టించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా అప్డేట్స్ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్క నున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ రోల్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈ మూవీలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్‌లో రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని.. ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా.. 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచ్చంట, గోపి అచ్చంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ సక్సెస్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా అఖండ 2 తాండవంపై ఆడియన్స్‌లో రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారని.. యాక్షన్‌తోపాటు.. ఫ్యామిలీ సెంటిమెంట్, అలాగే అన్ని ఎమోషన్స్ సినిమాలో చూపించబోతున్నారని ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీం. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.