ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏ భాషలో సినిమా హిట్ అయినా.. ఆ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసి సక్సెస్ అందుకోవాలని మేకర్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్నో సినిమాలు.. తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక.. అలాగే తెలుగులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న కొన్ని సినిమాలను కూడా.. పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు మన మేకర్స్.
ఈ క్రమంలోనే తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ చేసి.. డీల పడిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ అలా తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచి హిందీలో డిజాస్టర్ గా మిగిలిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నతమైన దర్శకుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో శైలేష్ కొలను కూడా ఒకరు. ఈయన విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ సినిమాను హిందీలోనూ హిట్ ది ఫస్ట్ కేస్ అనే టైటిల్‌తోనే రీమేక్ చేసి రిలీజ్ చేశారు.
అక్కడ కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోని సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అలా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలలో గౌతం తిన్ననూరి డైరెక్షన్లో నాని హీరోగా రూపొందిన జెర్సీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఇదే టైటిల్ తో హిందీలోను సినిమాను రీమేక్ చేశారు టీం. అక్కడ కూడా రిలీజ్ కు ముందు భారీ హైప్ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకోలేక డీలపడింది. ఇలా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్‌తో భారీ కలెక్షన్లు కల్లగొట్టిన ఈ రెండు సినిమాలు.. హిందీలో రీమేక్ అయ్యి అక్కడ డిజాస్టర్ గా నిలిచాయి.