టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాతోఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తనని నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక అల్లు అర్జున్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. పిల్లలతో ఆడుకోవడం, భార్యతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేయడం లాంటిది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
కాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేకున్నా.. మోడల్గా తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లతోపాటు.. అల్లు అర్హ, అయాన్‌లకు సంబంధించిన క్యూట్ వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. ఫ్యాన్స్‌లో ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది.
ఇలాంటి క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా వేదికగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఓ స్టోరీ తెగ వైరల్ గా మారుతుంది. అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నాకు ప్రస్తుతం ఏం కావాలంటే అనే క్యాప్షన్ దానికి జోడించింది స్నేహా. ఇక ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ అనే పదం రాసి ఉంది.. దీన్ని బట్టి స్నేహ రెడ్డి ప్రస్తుతం తనకు కావలసింది ట్రావెలింగ్ అని.. వెకేషన్కు ఎంజాయ్ చేయాలని ఉందేటూ ఇన్ డైరెక్ట్‌గా షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోస్ట్ నెట్ తెగ వైరల్ గా మారుడంతో దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.