టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను శ్రీరామనవమి సందర్భంగా తాజాగా రిలీజ్ చేశారు టీం ఇక ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అంతా కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ పాజిటివ్ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీజర్ లోని చివరి షార్ట్ కైతే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా రిపీటెడ్ గా ఈ టీజర్ ను చూడడం.. ప్రశంసలు కురిపించడంతో యూట్యూబ్లో టీజర్ సరికొత్త రికార్డులతో దుమ్మురేపుతుంది. పెద్ది తెలుగు వర్షన్ టీజర్‌ని వృద్ధి సినిమాస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేశారు. దెబ్బతో ఛానల్ దశ మారిపోయింది.. అనడంలో సందేహం లేదు. ఈ టీజర్‌ను రిలీజ్ చేయకముందు కేవలం 5వేల సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్‌కు.. టీజర్ తర్వాత ఒక్కసారిగా 35వేల మంది సబ్స్క్రైబర్స్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. కొత్త ఛానల్ కావడంతో.. వ్యూస్, లైక్స్ సరిగ్గా రావని ఫ్యాన్స్‌లో ఉన్న ఆందోళన అంతా ఒక్క దెబ్బతో పటా పంచలైంది.
టీజర్ కొత్త ఛానల్ లో సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన 7 గంటల్లో ఒక టీజర్ కు 13 మిలియన్ల పైగా వ్యూస్ రావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే టీజర్ కు 3 లక్షల 40వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక టీచర్ 24 గంటలు ముగిసేసరికి 5 లక్షలు లైక్ మార్క్ దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఫుల్ రన్ లో కచ్చితంగా టీజర్ 100 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంటుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కారణం టీజర్ లో ఉన్న పవర్ఫుల్ కంటెంట్.. ముఖ్యంగా చివరి షాట్ అయితే ఐపీఎల్ సీజన్ కు విపరీతంగా హైప్ తెచ్చుకుంటుంది. పెద్ద పెద్ద క్రికెట్ హ్యాండిల్స్ లో సైతం ఈ వీడియోను రాబోయే రోజుల్లో ఉపయోగించే ఛాన్స్ ఉంది. ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు టీం. అయితే సినిమా ఫ్యాన్స్ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.