మరో కొత్త ప్రాజెక్ట్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవ‌ర‌ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఫుల్ జోష్లో ఉన్న తారక్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్న తారక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్‌ని పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత తారక్ దేవర 2 ఉంటుందని తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వేర్‌ సక్సెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. అంతేకాదు.. నెల్సన్ దిలీప్ కుమార్‌తోను.. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమా ఉండబోతుందని హింట్‌ ఇచ్చారు.

Photo Moment: Jr NTR and Sukumar's latest pic is pure love

అయితే.. ఈ ప్రాజెక్టులతో పాటు ఎన్టీఆర్ లైన్‌లోకి మరో క్రేజీ ప్రాజెక్టు వచ్చి పడిందని తెలుస్తుంది. ఇక ఆ సినిమాకు జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించినట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో నాన్నకు ప్రేమతో మూవీ వచ్చి ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందంటూ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఫ్యాన్స్ కు వీళ్లిద్దరు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి హగ్ చేసుకున్న ఫోటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తారక్‌కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ జోడించారు.

ఆమె పోస్ట్‌ను రిపోస్ట్‌ చేసిన ఎన్టీఆర్.. నన్ను ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ సుక్కుమార్ అనే క్యాప్షన్ జోడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇద్దరి మధ్యన కథ చర్చలు జరుగుతున్నాయని.. సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్‌ ఇండియా లెవెల్ పాపులారిటీతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక.. చివరిగా సుకుమార్ పుష్ప 2 లాంటి సాలిడ్ సక్సెస్‌తో ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే పక్కా సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.