సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎదగాలంటే ముఖ్యంగా అందం కావాలి. నటన రాకపోయినా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా హాట్ అందాలతో కవ్వించి ఎక్స్పోజింగ్ చేసే అవకాశాలు కొట్టేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా చాలామంది వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ లో లైఫ్ ఎప్పుడు ఎవరికి ఎలా మారుతుందో చెప్పలేము. కొందరు లైఫ్ టర్న్ అయ్యి స్టార్ బ్యూటీలుగా రాణిస్తుంటే.. మరొకొందరు లైఫ్ తలకిందులై ఇండస్ట్రీకి దూరమవుతారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా స్టార్ హీరోలు అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ.. అందం ఉన్నా.. అవకాశాలు వచ్చిన.. ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీకి దూరమైంది.
ఇప్పుడు ఫారెన్ కంట్రీలో సెటిల్ అయినా ఈ అమ్మడు.. ఇంకాస్త అందంతో కుర్రాళ్లను కవ్వించే అవకాశాలు కొట్టేయాలని ఏకంగా ఆరు సర్జరీలను చేయించుకుందట. గతంలో ఈ ముద్దుగుమ్మ బడా స్టార్ హీరో కొడుకుతో కూడా లవ్ ట్రాక్ నడిపినట్లు సమాచారం. అయితే ఇండస్ట్రిలో సక్సస్ కావడానికి ఆమె చేసిన ఏ ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. సినిమాల్లో ఆఫర్స్ వచ్చిన హిట్ అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ హీరోయిన్ ఇండస్ట్రీ తో సహా.. ఫ్యామిలీకి కూడా గుడ్ బై చెప్పేసి సోలో లైఫ్ లో తనకు నచ్చినట్లుగా తాను వెళ్ళిపోతుంది.