తారక్ ఇండస్ట్రీకి ఓ వరం.. దగ్గుపాటి వెంకటేశ్వరరావు కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న తారక్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుతున్నాడు. ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాల్లో హృతిక్ రోషన్ మరో హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో మరో సినిమా నటించనున్నాడు. అంతేకాదు.. దేవర 2తో పాటు.. నెల్సన్ దిలీప్ కుమార్‌తో మరో సినిమా తారక్ లైనప్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

Daggubati Venkateswara Rao's Interference: BJP Leaders Unhappy? | Daggubati  Venkateswara Rao's Interference: BJP Leaders Unhappy?

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఆయన హోమ్ టూర్ నిర్వహించగా.. అందులో భాగంగా ఎన్టీఆర్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు స్పందించారు ఇంట‌ర్వ్యూవ‌ర్‌. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. నందమూరి పురందేశ్వరి భర్త. స్వయాన జూనియర్ ఎన్టీఆర్ చిన్న మామ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వెంకటేశ్వరరావు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఇండియన్ ఇండస్ట్రీకే ఎన్టీఆర్ ఒక వరం అని.. ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. రెండు, మూడు పేజీల డైలాగ్ లు కూడా ఇట్టే చెప్పగలడని ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు.

మీ మేనల్లుడు ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మీకు ఫేవరెట్ మూవీ ఏది అని యాంకర్ ప్రశ్నించగా.. కాస్త ఆలోచించిన వెంకటేశ్వరరావు.. ఎన్టీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే చాలా తక్కువ. ప్రస్తుతం పాన్ ఇండియా యుగం నడుస్తుంది. అతనిలో ఉన్న టాలెంట్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం తాజాగా జపాన్ వెళ్లి జపనీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడేశాడు. అతను ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు. అతనిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. తారక్‌కు దేవుడి అనుగ్రహం కూడా ఉంది అంటూ వెంకటేశ్వరరావు వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కామెంట్స్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.