టాలీవుడ్‌: హీరోయిన్లే రివర్స్‌లో ర‌మ్మ‌ని ఛాన్స్ ఇస్తారు.. కాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి షాకింగ్ రియాక్ష‌న్‌..!

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అవకాశాల పేరుతో దర్శక, నిర్మాతలు, హీరోలు ఇలా హీరోయిన్ల పై ఒత్తిడి తెస్తూ వేధించిన సంఘటనలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు అలాంటి చేదు అనుభవాల గురించి ఓపెన్ గా కామెంట్స్‌ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్‌కు లొంగిపోయి తమని తాము అర్పించుకుంటూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఎలాగైనా సినిమా ఛాన్స్ ముఖ్యమని క్యాస్టింగ్ కౌచ్‌కి స్వయంగా హీరోయిన్లు లొంగిపోతున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్‌లో రివర్స్ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంది. వాళ్ళు దేనికైనా రెడీ అని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారని.. అలాంటి సంఘటనలను నేను రెండు, మూడు సార్లు చూశాను అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. కొంతమంది డైరెక్ట‌ర్లు అడగడానికి మొహమాటపడుతున్నారేమో.. మనమే వాళ్లకి ఆఫర్ ఇచ్చేద్దామని.. సినిమాలో ఛాన్స్ కొట్టేద్దామని చాలామంది భావిస్తున్నారు..

వాళ్ళే దర్శకుల దగ్గరకు వెళ్లి మరీ ఓపెన్ గా ఆఫర్ చేస్తున్నారు అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక తాను మాత్రం తన సినిమాలో నటించే హీరోయిన్లను తన ఇంటి ఆడపిల్లలుగా భావిస్తానని.. ఒకరి దగ్గర హీరోయిన్లు ఇలా బాడ్ బిహేవ్ చేసిన వాళ్ళని పట్టించుకోలేదని త‌మ్మారెడ్డి చెప్పుకొచ్చాడు. తమ్మారెడ్డి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.