మహేష్ సినీ కెరీర్‌లో లేడీ గెటప్‌లో నటించిన ఏకైక మూవీ ఇదే..?

ప్రతి ఏడది నటనపై ఫ్యాషన్ తో ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్స‌స్ అందుకుంటున్నారు. వీరిలో చాలామంది సక్సస్‌ అందుకోవడం కోసం.. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా.. ఇప్పటికే హీరోలు ఆడవేషం వేసుకోవడం, హీరోయిన్ హాఫ్‌ న్యూడ్ గా, గుండు కొట్టించుకుని కనిపించడం ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఎంతో మంది నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే.. స్టార్ సెలబ్రిటీలుగా భారీ పాపులారిటీ ఏర్పడిన తర్వాత కూడా.. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు లేడీ గెటప్లో నటించి ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

Balachandrudu - Wikipedia

కానీ.. స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ అయిన వారు మాత్రం.. ఇలాంటి లేడీ గెటప్‌లో నటించడం అంటే అది పెద్ద సాహసం అవుతుంది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్‌తో సహా.. ఎంతో మంది స్టార్ హీరోస్ లేడీ గెటప్‌లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈ లిస్టులోనే మహేష్ బాబు పేరు కూడా వినిపిస్తుంది. మహేష్ బాబు కూడా ఓ సినిమాలో చీరకట్టి వయ్యారాలు వలకపోసుకుంటూ.. అచ్చ తెలుగు ఆడపిల్లలా.. మెలికలు తిరిగిపోతూ ఉంటాడు.

ఇంతకీ.. మహేష్ బాబు లేడీ గెటప్‌లో నటించిన మూవీ మరేదో కాదు.. బాలచంద్రుడు. మహేష్ తన టీనేజ్ లో నటించిన ఈ సినిమాకు.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించని ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, రామిరెడ్డి, ఎం.ప్రభాకర్ రెడ్డి తదితరులు కీలకపాత్రలో మెరిశారు. బ్యానర్ పై 1990లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. యావరేజ్ టాక్‌ను ద‌క్కించుకుంది. కాగా ఈ సినిమాలో రౌడీలను అట్రాక్ట్ చేసే ఓ సన్నివేశం కోసం మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించాడు. చీర చుట్టి.. మల్లెపూలు పెట్టి తనదైన నాటి యాక్టింగ్‌తో అప్పట్లోనే ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేశాడు. అంతేకాదు.. మహేష్ కెరీర్ మొత్తంలో లేడీ గెటప్‌లో నటించిన ఏకైక మూవీ కూడా ఇదే.

Mahesh Gari Teaser - Page 2 - Chat Room - NFDB

ఇక ఫుల్ ప్లజేడ్ హీరోగా మారిపోయిన తర్వాత.. మహేష్ బాబు అలాంటి ఛాలెంజింగ్ పాత్రలో ఎప్పుడు నటించలేదు. ఒకవేళ నటించడానికి ఒప్పుకున్నా.. ఫ్యాన్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. అసలు తట్టుకోగలరా అనే ఆలోచనలతో ఎలాంటి పాత్రలు అంగీకరించరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేష్ ప్రస్తుతం తన 29వ ప్రాజెక్టులో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కే.ఎల్. నారాయణ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించినన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.