టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత దేవరతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు మిక్స్డ్ టాప్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచి అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్న ఎన్టీఆర్.. వరుస ప్రాజెక్టులను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.
కాగా.. తాజాగా ఎన్టీఆర్ ఊతపదాన్ని తరచుగా వాడుతూ ఉంటాడని.. న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎన్టీఆర్ వాడే ఆ ఊతపదం ఏంటి.. దాన్ని ఆయన ఎవరి నుంచి అలవాటు చేసుకున్నాడు.. ఒకసారి తెలుసుకుందాం. సాధారణ వ్యక్తులే కాదు, స్టార్ సెలబ్రెటీస్ సైతం కొన్ని సందర్భాల్లో ఈ ఊతపదాన్ని వాడుతూ ఉంటారు. రెగ్యులర్గా అవసరం ఉన్నా, లేకున్నా ఆ భూత పదం మాత్రం నోటి నుంచి వచ్చేస్తూ ఉంటుందట. అలా ఎన్టీఆర్ తరచూ వాడే ఊతపదం మరేదో కాదు అరే నీ.
సాధారణంగా ఈ పదాన్ని ఎవరిపై అయినా కోపం వచ్చినప్పుడు లేదా.. ఎవరైనా చెప్పిన మాట మనకు నచ్చని సందర్భాల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ఇది తిట్టు కాదు. అలా అని మంచి పదం కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ పదాన్ని తరచు వాడుతూనే ఉంటాడట. షూటింగ్స్ లో, పార్టీల్లో అవసరం ఉన్నా.. లేకున్నా.. మాటల్లో భాగంగా అరే నీ అనే పదం వచ్చేస్తుందట. ఈ పదం రోజుకు ఒక 10,15 సార్లు వాడతారని తెలుస్తుంది. ఎక్కువగా ఆయన స్నేహంగా ఉండే రాజమౌళి, చరణ్, అఖిల్, రాజీవ్ కనకాల దగ్గర ఈ పదాన్ని బాగా వాడతారట.